Reading Time: 2 minutes
Cinema: థియేటర్లలో జస్ట్ యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 కోట్లకు పైగా వ్యూస్

ఈ మధ్యన నార్త్ ఆడియెన్స్ మాస్ సినిమాలంటే తెగ ఆసక్తి చూపిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్ ఉన్న సినిమాలంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెగ చూసేస్తున్నారు. కేజీఎఫ్ 2, పుష్ప 2 వంటి ఊర మాస్ సినిమాలకు వేల కోట్లు కలెక్షన్లు రావడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో గతంలో థియేటర్లలో విడుదలై పెద్దగా ఆడని మాస్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అలా గతంలో యావరేజ్ గా నిలిచిన ఒక తెలుగు సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఏకంగా 100 కోట్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా
‘జయ జానకి నాయక’ . 2017లో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులో యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి శ్రీను టేకింగ్, స్టైల్ కు ఏ మాత్రం తగ్గకుండా మాస్ యాక్షన్ సీన్స్ , కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఇప్పుడు నార్త్ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.

‘జయ జానకి నాయక’ సినిమాను ‘ఖూన్‌ఖార్’ పేరుతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) కు పైగా వ్యూస్ వచ్చాయి. తద్వారా ఈ ఘనతను సాధించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ‘జయ జానకి నాయక’ నిలిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జన నాయకి నాయక సినిమాలో భారీ తారాగణమే ఉంది. ఈ మూవీలో బెల్లంకొండ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రగ్యా జైస్వాల్, శరత్ కుమార్, జగపతి బాబు, నందు, జయ ప్రకాశ్, సితార, శశాంక్, సుమన్, వాణి విశ్వనాథ్, రూపా లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, అలాగే బీజీఎమ్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.