Reading Time: 2 minutes
Husband Shocked After Suddenly Walking In While Wife Was On Video Call

డబ్బుపై వ్యామోహం, పరాయి వ్యక్తులపై మోజు, క్షణిక కాల ఆనందాలో కోసం కొందరు మహిళలు, పురుషులు తప్పటడుగులు వేస్తున్నారు. సాఫీగా సాగుతున్న కాపురంలో కలహాలకు కారణమవుతున్నారు. ఆ తర్వాత క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతూ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్య వీడియో కాల్ మాట్లాడుతుండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే భార్యను ఫోన్ అడగ్గా ఇవ్వడానికి నిరాకరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ భర్త తన భార్యను గొంతు నులిమి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి

పోలీసుల కథనం ప్రకారం, దీపక్ అనే యువకుడు చాలా కాలంగా తన భార్య సోనమ్‌పై అనుమానం పెంచుకున్నాడు. ఏప్రిల్ 19న, దీపక్ రాజస్థాన్‌లోని అల్వార్ నుండి గురుగ్రామ్‌లోని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే, అతను వంటగదిలో తన భార్య సోనమ్ ఒకరితో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా చూశాడు. దీపక్‌ను చూడగానే, సోనమ్ కాల్ కట్ చేసింది.

వివాదం ఇక్కడే మొదలైంది. దీపక్ సోనమ్‌ను ఆమె ఫోన్ అడగ్గా, ఆమె నిరాకరించింది. అప్పటికే అనుమానాలు బలపడటంతో, కోపం అదుపు తప్పింది. పోలీసుల కథనం ప్రకారం, దీపక్ వెనుక నుండి సోనమ్ వద్దకు వచ్చి, ఆమె స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపాడు.

తన భార్యను చంపిన తర్వాత, దీపక్ ఉరి వేసుకున్నాడు. సోనమ్ సోదరి ఫోన్ చేసినప్పుడు, ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో, ఆమె తన 14 ఏళ్ల కూతురిని ఇంటికి పంపించగా దీపక్, సోనమ్ విగతజీవులుగా పడి ఉండడంతో భయాందోళనకు గురై కేకలు వేసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Also Read:Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత

పోలీసుల విచారణలో, సోనమ్ ఫోన్ నుండి ఒక గుర్తుతెలియని నంబర్‌కు తరచుగా కాల్స్, వీడియో కాల్స్ వచ్చినట్లు వెల్లడైంది. దీని ఆధారంగా, అనుమానంతో జరిగిన వివాదమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన దీపక్, సోనమ్‌లు సుమారు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో అంతా బాగానే ఉంది, కానీ కాలక్రమేణా వారి సంబంధంలో కలహాలు చెలరేగి, ఈ ఘోరానికి దారితీసింది. పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.