Reading Time: < 1 minute
Pappu Yadav Remarks On Women In Politics Spark Major Controversy Womens Commission Issues Notice

Pappu Yadav: బీహార్ పుర్నియా ఎంపీ పప్పు యాదవ్ మహిళల రాజకీయ ప్రవేశం గురించి చేసిన అభ్యకరమైన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వైరల్ కావడంతో బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో మహిళల దోపిడి గురించి మాట్లాడుతూ.. ‘‘ఏ రాజకీయ నాయకుడి గదికి వెళ్లకుండా 90 శాతం మంది మహిళలు తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించలేరు’’ అని వ్యాఖ్యానించడం దుమారానికి కారణమైంది.

Read Also: Allu Arjun: ఇకపై ‘ఐకాన్ స్టార్’ పేరు, గొంతు వాడితే జైలుకే!

‘‘గృహహింసకు పాల్పడుతున్నది ఎవరు? అమెరికా నుంచి భారత్ వరకు మహిళల్ని వేటాడుతున్నది ఎవరు? రాజకీయ నాయకులే. ఏ పురుష రాజకీయ నాయకుడి గదికి వెళ్లకుండా 90 శాతం మహిళలు రాజకీయాల్లోకి రాలేరు’’ అని పప్పు యాదవ్ అన్నారు. మహిళల్ని దోపిడీ చేసే సంస్కృతి మన వ్యవస్థలో పాతుకుపోయిందని ఆయన అన్నారు. నాయకుడు మహిళల పట్ల రాబందుల్లా ప్రవర్తిస్తున్నారని, 70 శాతం మంది నాయకులు అశ్లీల చిత్రాలను చూస్తుంటారని, వారు వారి ఫోన్లను చెక్ చేసుకోండి అని అన్నారు. అణగారిన కులాల మహిళలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదని చెప్పారు.

ఇదిలా ఉంటే, పప్పు యాదవ్ వ్యాఖ్యలపై బీహార్ ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.