
Amazon: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో మరో భారీ డీల్ కుదిరింది. ప్రముఖ ఇ-కామర్స్, క్లౌడ్ దిగ్గజం అమెజాన్, ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో ఏకంగా 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ మరింత ముదిరింది. ఈ భారీ డీల్ ముఖ్యాంశాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pappu Yadav: ‘‘రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంలోకి వెళ్లాల్సిందే’’.. మహిళలపై ఎంపీ అసభ్యకర వ్యాఖ్యలు..
అమెజాన్ – ఆంత్రోపిక్ డీల్ విశేషాలు ఇవే..
అమెజాన్ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుండగా, భవిష్యత్తులో మైలురాళ్లను బట్టి మరో 20 బిలియన్ డాలర్లు అందించనుంది. ఇదివరకు అమెజాన్ పెట్టిన 8 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనం. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ సంస్థ రాబోయే పదేళ్లలో అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీస్‌పై 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. ఆంత్రోపిక్ తన తదుపరి ఏఐ మోడల్స్ శిక్షణ కోసం అమెజాన్ స్వయంగా తయారు చేసిన ‘ట్రైనియం’ చిప్స్‌ను ఉపయోగించనుంది.
ఏఐ రేసులో అమెజాన్ వ్యూహం..
అమెజాన్ తన సొంత ఏఐ మోడల్స్ (ఉదాహరణకు ‘నోవా’) తో పెద్దగా గుర్తింపు పొందలేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (క్లౌడ్ సేవలు) పరంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. ఈ ఏడాది అమెజాన్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదాపు 200 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆంత్రోపిక్ మాత్రమే కాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్ ఏఐలో కూడా 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించడం గమనార్హం. ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకులు 2021లో స్థాపించిన ఆంత్రోపిక్.. తన ‘క్లాడ్’ ఏఐ మోడల్స్‌తో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆంత్రోపిక్ వార్షిక ఆదాయం 30 బిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంస్థ కేవలం అమెజాన్‌తోనే కాకుండా మైక్రోసాఫ్ట్ (5 బిలియన్ డాలర్ల పెట్టుబడి), గూగుల్‌తో కూడా భాగస్వామ్యాలను కలిగి ఉంది.
ఈ భారీ పెట్టుబడి ప్రకటనతో అమెజాన్ షేర్లు ట్రేడింగ్‌లో సుమారు 2.7% పెరిగాయి. ఆంత్రోపిక్ ఈ ఏడాది చివరలో ఐపీఓకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏఐ మార్కెట్లో దాని స్థానాన్ని మరింత బలపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Kedarnath: కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!