Reading Time: < 1 minute
Trump Praises Pakistan Shehbaz Sharif Asim Munir Iran Deal Visit Islamabad

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. షరీఫ్, మునీర్ చాలా మంచి పని చేస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. త్వరలోనే ఇరాన్‌తో ఒప్పందం జరగబోతుందన్నారు. అయితే సంతకం చేసేందుకు వ్యక్తిగతంగా పాకిస్థాన్‌కు వెళ్తారా? అని విలేకరి అడగ్గా… ‘‘పాకిస్థాన్ చాలా మంచిది. వాళ్లు గొప్ప పని చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లో ఒప్పందంపై సంతకాలు జరిగితే వ్యక్తిగతంగా పాకిస్థాన్ వెళ్తాను.’’ అని బదులిచ్చారు.

ఇది కూడా చదవండి: Samrat Choudhary: బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి బెదిరింపులు.. ఒకరు అరెస్ట్

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తుంది. ఆలోపే శాంతి ఒప్పందం జరిగేలా చూసేందుకు అసిమ్ మునీర్ ఇరాన్‌కు వెళ్లారు. ఇరాన్ అగ్ర నాయకత్వంతో సమావేశమై ఒప్పందంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే యురేనియం అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. గాల్లో మేడలు కట్టొద్దని సూచించింది.

ఇది కూడా చదవండి: Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మునీర్, షరీఫ్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. శాంతి ఒప్పందం జరుగుతుందా? లేదంటే యుద్ధం కొనసాగుతుందా? అన్నది తేలాల్సి ఉంది.