Reading Time: < 1 minute
Bjp Chief Ministers Count India Samrat Choudhary Bihar Cm

దేశ వ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ కూడా బీజేపీ కైవసం అయింది. దీంతో బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య 16కు చేరింది. బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీకి 16 మంది ముఖ్యమంత్రులయ్యారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, అసోం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

బీహార్‌లో తొలిసారి బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రయ్యారు. సామ్రాట్ చౌదరి బీహార్ పగ్గాలు చేపట్టారు. నితీష్ కుమార్ రాజీనామాతో సామ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కింది. గతంలో నితీష్ కేబినెట్‌లో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా.. హోంమంత్రిగా సేవలందించారు. ఇక సామ్రాట్ చౌదరితో పాటు జేడీయూకు చెందిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌధరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ 18 శాఖలు కేటాయించగా.. హోంతో సహా 29 శాఖలను సామ్రాట్ నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ