Reading Time: < 1 minute
Rukmini Vasanth Cast In Dhanush D57 Movie Update

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తన నేచురల్ యాక్టింగ్‌తో ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది. రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara 2) లో కనకవతిగా పవర్‌ఫుల్ రోల్ దక్కించుకున్న ఈ భామకు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ఈమెకు దక్కింది.

Also Read : Mrunal Thakur: విదేశీ యూనివర్సిటీల్లో ‘RRR’ క్లాసులు..

‘లబ్బర్ పందు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తమిళరస పద్యముత్తు (Tamilarasan Pachamuthu), తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో తెరకెక్కించబోతున్నారు. ధనుష్ కెరీర్‌లో 57వ చిత్రంగా (D57) రాబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారు. గతంలో ఆమె కోలీవుడ్‌లో చేసిన ‘ఏస్’ (విజయ్ సేతుపతి సరసన), ‘మదరాసి’ (శివకార్తికేయన్ సరసన) చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ, ఈ ధనుష్ ప్రాజెక్ట్ ఆమెకు కోలీవుడ్‌లో గ్రాండ్ బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం తమిళంలోనే కాదు, అన్ని ప్రధాన భాషల్లోనూ.. ఎన్టీఆర్, యష్, ధనుష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవడంతో రుక్మిణి వసంత్ కెరీర్ ఇప్పుడు టాప్ గేర్‌లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యే 2026-27 సంవత్సరాల్లో రుక్మిణి సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.