Reading Time: < 1 minute
Tollywood Bankable Hero Upcoming Film Stuck Financial Crisis

Tollywood: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలతో టైర్-2 నుంచి టాప్ లీగ్‌లోకి దూసుకుపోతున్న ఒక హీరో కెరీర్ ఇప్పుడు ఒక చిక్కుముడిలో పడినట్లు కనిపిస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకుని, నిర్మాతలకు కల్పవృక్షంగా మారిన ఒక యంగ్ హీరో ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. సదరు హీరో మార్కెట్ పెరగడంతో అతని తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

అయితే, బయట కనిపిస్తున్న హైప్‌కు, లోపల జరుగుతున్న వ్యవహారాలకు అస్సలు పొంతన లేదని సమాచారం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కాదని మేకర్స్‌కు ముందు నుంచే క్లారిటీ ఉంది. అయినప్పటికీ, బిజినెస్ పరంగా క్రేజ్ తగ్గకూడదనే ఉద్దేశంతో హడావిడిగా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్నట్టుగానే జరగక పోవడం, మాటిమాటికీ షూట్ ఆగిపోతుండటంతో, ఇంకా మేజర్ పార్ట్ షూటింగ్ పెండింగ్‌లోనే ఉండటంతో … ప్రకటించిన సమయానికి ఈ సినిమా థియేటర్లలోకి రావడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

షూటింగ్ జాప్యమే కాకుండా, ఈ సినిమాకు ఆర్థిక కష్టాలు కూడా తోడయ్యాయి. నిర్మాణ సంస్థ తీవ్రమైన ఫండింగ్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే సినిమాను గట్టెక్కించడానికి ఇటీవల ఒక పార్టనర్ కో-ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూసి చేతులెత్తేసిన ఆయన, ఆర్థిక భారాన్ని మోయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. సెట్స్‌పై కెమెరా ఎప్పుడు మళ్ళీ రన్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నప్పటికీ, లోపాలను సరిదిద్దకపోతే ఆ హీరో కెరీర్‌లో ఇదొక పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ హీరో తన టీమ్‌ను సెట్ చేసుకుని, ఈ సంక్షోభం నుంచి సినిమాను ఎలా బయటపడేస్తారో వేచి చూడాలి.