Reading Time: 2 minutes
Mlc Ananthababu Wife Lakshmi Durga Petition Dismissed In Door Delivery Murder Case

Dead Body Door Delivery Case: సంచలనం రేపిన డ్రైవర్‌ హత్య డోర్ డెలివరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండో నిందితురాలిగా చేర్చిన తనను కేసు నుంచి తొలగించాలని లక్ష్మీ దుర్గ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వాదనలు, ప్రతివాదనలు పూర్తయ్యాక ఇవాళ రాజమండ్రి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు, టెక్నికల్ మరియు సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు, ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఈ కేసులో ఆమెపై ఉన్న ఆరోపణలు కొనసాగనున్నాయి. 2022 మేలో జరిగిన ఈ డోర్ డెలివరీ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణను ఈ ఏడాది నవంబర్ లోపు పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Tadka Buttermilk Recipe: వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం..! ఇంట్లోనే సులువుగా తడ్కా మజ్జిగ ఇలా తయారు చేయండి..

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన డోర్ డెలివరీ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజమండ్రి జిల్లా సెషన్స్ కోర్టులో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీ దుర్గను సిట్ పోలీసులు రెండో నిందితురాలిగా చేర్చారు. అయితే తనను ఈ కేసు నుంచి తొలగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు, ప్రతివాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో వాదనలు ముగిసిన అనంతరం రాజమండ్రి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇవాళ తీర్పు వెలువరించారు. ప్రాథమిక సాక్షాధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు లక్ష్మీ దుర్గ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో డోర్ డెలివరీ హత్య కేసులో ఆమెపై ఉన్న ఆరోపణలు కొనసాగనున్నాయి. ఈ తీర్పు కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. 2022 మే నెలలో జరిగిన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణను ఈ ఏడాది నవంబర్ లోపు పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాసిక్యూషన్ తరఫున ప్రభుత్వ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. కోర్టు తాజా తీర్పుతో కేసు విచారణ మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.