Reading Time: < 1 minute
Vikram And Anand Shankar Team Up Again Harris Jayaraj Joins The Big Commercial Project

2016లో వచ్చిన ఇంకొక్కడుతో విక్రమ్ , ఆనంద్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా విక్రమ్‌ను డ్యూయల్ రోల్‌లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఆనంద్ శంకర్, విక్రమ్ జోడీ కలవడం ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, వీళ్ల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Telugu Cinema : రూట్ మారుస్తోన్న టాలీవుడ్ హీరోలు.. పీరియాడిక్ కథలపై ఫోకస్

మ్యూజిక్ డైరెక్టర్‌గా హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తుండగా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో కూడా భారీ చర్చలు జరిగాయి. మొదట 60–65 కోట్లుగా ప్లాన్ చేసిన బడ్జెట్‌ను చివరికి 50–55 కోట్ల మధ్యలో ఫిక్స్ చేశారు. విక్రమ్ కూడా తన రెమ్యునరేషన్‌ను తగ్గించి 25 కోట్లకు ఒప్పుకొని, మిగతాది ప్రాఫిట్ షేర్‌గా తీసుకునేలా డీల్ ఫైనల్ అయ్యింది. తంగలాన్ తో చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, చియాన్ విక్రమ్ వెంటనే వీర ధీర శూరతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 55 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ వరల్డ్‌వైడ్‌గా 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా, ఫుల్ ప్రాఫిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు విక్రమ్ స్ట్రాటజీ మార్చి, సేఫ్ కమర్షియల్ జానర్ వైపు మళ్లడం ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఆనంద్ శంకర్ తో హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 17న అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నారు.