Reading Time: < 1 minute
Prabhas Watched Dhurandhartherevenge Last Night At Allucinemas

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్‌లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ‘అల్లు సినిమాస్’లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశారు.

Also Read : Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

సాధారణంగా సెలబ్రిటీలు ప్రైవేట్ స్క్రీనింగ్స్‌కు మొగ్గు చూపుతారు. కానీ ప్రభాస్ మాత్రం థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం విశేషం. ప్రభాస్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ధురంధర్‌ 2ను వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిజానికి, ప్రభాస్ ఇలా ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. బాహుబలి తర్వాత పబ్లిక్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు దాదాపుగా దూరమయ్యాడు డార్లింగ్. అసలు తన సినిమా ప్రమోషన్స్‌ కూడా సరిగ్గా చేయడం లేదు. ఇలాంటి సమయంలో సందీప్‌తో కలిసి థియేటర్లో సినిమా చూడడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సందీప్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ధురంధర్‌ను థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేశాడంటే.. స్పిరిట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే.. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్‌ను దగ్గరుండి మరీ చూశాడు డార్లింగ్. ఖచ్చితంగా.. ఇది ప్రభాస్‌ను తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు తెస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.