Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా క్వాసి ఒబిరి-డాన్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ ను కలిశారు. ఘన, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని సిఎం రేవంత్ ను హైకమిషనర్ క్వాసి ఒబిరి డాన్ కోరారు.