Reading Time: < 1 minute
Akhils Lenin Release Confirmed For June 26 Will It Clash With Ram Charans Peddi

ఏప్రిల్ 8న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సందర్భంగా.. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌తో పాటు మరోసారి రిలీజ్ డేట్‌ కన్ఫామ్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో క్లాష్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఒక అడుగు వెనక్కి తగ్గారు.

Also Read : Heroines – Weird Things : హీరోయిన్స్ విషయంలో హద్దులు దాటుతోన్న అభిమానం

కానీ ఇప్పుడు పెద్ది కూడా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టే. ఏప్రిల్ 30న రావాల్సిన ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. మరోసారి అఖిల్ సినిమాను ఇంకాస్త వెనక్కి జరపాలని నిర్మాణ సంస్థలు.. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరోసారి లెనిన్ అనుకున్న సమయానికి థియేటర్లోకి రావడం పక్కా అని మేకర్స్ తెలిపారు. మరి పెద్ది జూన్‌లోనే వస్తుందా? లేదా అంతకంటే ముందే మే నెలలో విడుదలవుతుందా? మరింత వెనక్కి వెళ్తుందా? అనేది వేచి చూడాల్సిందే. కానీ ఈసారి పక్కా ప్లానింగ్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. త్వరలోనే పెద్ది కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనుండగా.. మెగాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.