Reading Time: < 1 minute
Netanyahu Lebanon Ceasefire Not Applicable Israel Hezbollah Strikes Continue

లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదని.. హిజ్బుల్లాపై సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణను అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్‌పై కాల్పులు ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో పోరాటాన్ని కొనసాగిస్తాయని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం బుధవారం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ప్రతీకారంగా అప్పటి నుంచి లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే తాజాగా ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు ఆగిపోయాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు