Reading Time: 2 minutes
Vitamin B12 Rich Soups Health Benefits

శరీరానికి అవసరమైన అత్యంత కీలకమైన పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది లోపిస్తే కేవలం నీరసం మాత్రమే కాదు, నేరుగా నరాల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాళ్లలో సూదులు గుచ్చినట్లు అనిపించడం, నడకలో వణుకు, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ముఖ్యంగా కొన్ని రకాల సూప్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు.

Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!

విటమిన్ బి12 లోపంతో వచ్చే ప్రధాన సమస్యలు:

  • శరీరంలో బి12 స్థాయిలు తగ్గితే మెదడు , నరాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. దీనివల్ల:
  • కాళ్ల పాదాల్లో తిమ్మిర్లు రావడం, మొద్దుబారిపోవడం.
  • నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం లేదా వణుకు రావడం.
  • విపరీతమైన అలసట, చర్మం రంగు మారడం, బరువు తగ్గడం.
  • కండరాలు లోపల నుండి బలహీనపడటం.

 

బి12 స్థాయిలను పెంచే అద్భుత సూప్‌లు:

1. చికెన్ బోన్ బ్రోత్ సూప్ (Chicken Bone Broth): చికెన్ ఎముకలను చాలా గంటల పాటు తక్కువ మంటపై మరిగించడం ద్వారా ఈ సూప్‌ను తయారు చేస్తారు. ఇందులో విటమిన్ బి12తో పాటు కొల్లాజన్ (Collagen) , అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ప్రయోజనం: ఇది దెబ్బతిన్న నరాలను బాగు చేయడానికి, కండరాలను లోపలి నుండి దృఢపరచడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మనం తీసుకునే ఆహారం నుండి బి12ను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.

2. పాలకూర సూప్ (Spinach Soup): శాఖాహారులకు పాలకూర ఒక అద్భుత వరం. ఇందులో ఐరన్, మెగ్నీషియం , నైట్రేట్లు అధికంగా ఉంటాయి.

ప్రయోజనం: ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేసి కండరాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. కాళ్లలో వచ్చే తిమ్మిర్లు, నీరసం , వణుకును తగ్గించడంలో పాలకూర సూప్ తక్షణ ఫలితాన్ని ఇస్తుంది.

విటమిన్ బి12 సహజంగా మాంసం, గుడ్లు, పాలు వంటి జంతు సంబంధిత ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ లోపం తీవ్రంగా ఉన్నట్లయితే కేవలం ఆహారంపైనే ఆధారపడకుండా, వైద్యుల సలహాతో సరైన సప్లిమెంట్లను తీసుకోవడం శ్రేయస్కరమని డాక్టర్ శ్రీవత్స సూచించారు. రోజువారీ ఆహారంలో పైన పేర్కొన్న సూప్‌లను భాగంగా చేసుకోవడం వల్ల నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!