
Virat Kohli vs Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడటంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ వచ్చే ప్రపంచకప్ ఆడాలంటే వారి వయస్సు, ఫిట్‌నెస్, ఫామ్ లపైనే ఆధారపడి ఉంటుంది. సీనియారిటీ కంటే జట్టు భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తామని ఇటివల టీమిండియా మేనేజ్మెంట్ క్లియర్ మేసేజ్ పాస్ చేసింది. బీసీసీఐ వ్యాఖ్యలతో వన్డే వరల్డ్ కప్ రేసు నుంచి రోహిత్, కోహ్లీలని తప్పించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరం:
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లు మరోసారి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై నమ్మకం పెట్టారు. రోహిత్ అనుభవాన్ని ఎవరూ శంకించనప్పటికీ.. సెలెక్టర్ల ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు జట్టులో సుదీర్ఘ ఛాన్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరం.. రోహిత్ శర్మని సెలక్ట్ చేయడం వల్ల అతనికి అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.
గత 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు.. జైస్వాల్కి నో ఛాన్స్:
యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో సాలిడ్ పర్ఫామెన్స్ ఇస్తున్నప్పటికీ, అతడ్ని సెలెక్టర్లు పక్కన పెట్టడంపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైస్వాల్ తను ఆడిన గత మూడు వన్డేల్లో ఏకంగా రెండు సెంచరీలు కొట్టాడు. సౌతాఫ్రికాపై నాటౌట్‌గా 116 పరుగులు చేయగా, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా 110 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా లాంటి బలమైన వన్డే జట్టులో ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఎవరికి వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. జైస్వాల్ తనకు వచ్చిన అవకాశాలను రెండు చేతులా పట్టుకున్నాడు. అయినా అతనికి జట్టులో చోటు ఇవ్వడకపోవడం దురదృష్టకరం అని మంజ్రేకర్ అన్నారు.
2027 వరల్డ్ కప్ ప్లాన్స్:
భారత క్రికెట్‌లో పెద్ద స్టార్ క్రికెటర్ల కల్చర్ గురించి మంజ్రేకర్ ఓపెన్‌గా మాట్లాడుతూ.. సెలెక్టర్లు రోహిత్ శర్మను ఎంపిక చేశారంటే.. అది నిజంగానే 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్‌లో భాగంగానే ఉండాలని ఆశిస్తున్నాను.. మన దగ్గర కేవలం క్రికెటింగ్ మెరిట్ చూసి మాత్రమే నిర్ణయాలు తీసుకోరు, పెద్ద ప్లేయర్స్ ఇమేజ్ కూడా పని చేస్తుంది. ఒకవేళ కేవలం జట్టు నుంచి డ్రాప్ చేయలేక మాత్రమే రోహిత్‌ను ఎంపిక చేస్తుంటే.. అది భారత క్రికెట్‌లో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద సమస్యగా మారనుందని పేర్కొన్నాడు. అలాగే సెలెక్షన్ అనేది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా జస్ప్రీత్ బుమ్రా.. ఇలా ఎవరికీ అనుకూలంగా ఉండకూడదని, కేవలం భారత క్రికెట్ భవిష్యత్తుకు ఏది మంచిది అనే కోణంలోనే సాగాలని మంజ్రేకర్ స్పష్టం చేశారు.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు:
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు వెళ్తున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో శ్రీలంక-ఏ ప్లేయర్‌తో జరిగిన గొడవ (Altercation) నుంచి అతను మంచి గుణపాఠం నేర్చుకున్నాడని చెప్పారు. వైభవ్ చాలా మెచ్యూర్డ్, అవేర్‌నెస్ ఉన్న ప్లేయర్, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అతను చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ఇంగ్లాండ్ గడ్డపై రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.