
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమింగ్ పనితీరుకు ప్రత్యేక గుర్తింపు పొందిన iQOO, తన కొత్త Neo సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ iQOO Neo11s లేదా Neo11 SE పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా అధికారికంగా పేరు ప్రకటించకపోయినా, బయటకు వస్తున్న వివరాలు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు, భారీ బ్యాటరీ, అత్యంత వేగవంతమైన డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టించనుందని అంచనా వేస్తున్నారు.
కస్టమ్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, iQOO Neo11s కోసం ప్రత్యేకంగా రూపొందించిన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే CPU క్లాక్ స్పీడ్ కొద్దిగా తగ్గించినప్పటికీ, పనితీరులో ఎలాంటి రాజీ ఉండదని తెలుస్తోంది. దీని వల్ల వినియోగదారులు ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును తక్కువ ధరలో పొందే అవకాశం ఉంటుంది.
144Hz 2K డిస్‌ప్లే
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 2K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. దీని ప్రయోజనాలు.. అత్యంత స్మూత్ గేమింగ్ అనుభవం. వేగవంతమైన టచ్ రెస్పాన్స్, మెరుగైన వీడియో వీక్షణ, కర్వ్డ్ డిస్‌ప్లేలతో పోలిస్తే తక్కువ మిస్‌టచ్‌లు, గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వినియోగదారులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
8000mAh భారీ బ్యాటరీ
Neo11sలో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ అని చెప్పవచ్చు. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో 8000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ, దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్, ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు ఉపయోగించే అవకాశం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కంటే ఇది ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంది.
ప్రీమియం ఫీచర్లతో రాబోతోంది
iQOO Neo11sలో మరిన్ని ఆధునిక ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
ముఖ్య ఫీచర్లు:
అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
IP69 హై-ప్రెజర్ వాటర్ ప్రొటెక్షన్
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ
మెరుగైన గేమింగ్ కూలింగ్ సిస్టమ్. ఈ ఫీచర్లు సాధారణంగా హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రమే కనిపిస్తాయి.
ఎప్పుడు లాంచ్ అవుతుంది?
iQOO నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో చైనాలో Neo11s లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ధర, కెమెరా, ఛార్జింగ్ స్పీడ్ తదితర వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశముంది.