
Ganpati Bappa Blessed Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్తాన్‌పై పోర్చుగల్ జట్టు 5–0 తేడాతో సాధించిన ఘన విజయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం క్రిస్టియానో రొనాల్డో మెరుపులతోనే కాదు.. స్టేడియంలో చోటు చేసుకున్న అరుదైన దృశ్యం ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఫ్యాన్ స్టేడియం లోపలికి వినాయకుడి (Lord Ganesha) విగ్రహాన్ని చేతపట్టుకుని రొనాల్డోను ఉత్సాహపరచడం కెమెరా కంటికి చిక్కింది.
వినాయకుడి ఆశీస్సులు.. రొనాల్డో గోల్:
గత కొన్ని రోజులుగా మెగా టోర్నమెంట్లలో గోల్స్ చేయలేక ఇబ్బంది పడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో.. ఈ మ్యాచ్‌లో ఏకంగా రెండు సూపర్ గోల్స్ (Brace) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ వినాయకుడి విగ్రహాన్ని లింక్ చేస్తూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. వినాయకుడి ఆశీస్సుల వల్లే రొనాల్డో గోల్ కొట్టాడు అని కొందరు, హిందూ దేవుడి పట్ల సదరు అభిమాని చూపించిన భక్తి, సాంస్కృతిక ప్రతీక అద్భుతమంటూ మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ఉజ్బెకిస్తాన్‌పై పోర్చుగల్ రచ్చ రచ్చ!
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న రొనాల్డో, సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్ కొట్టడంతో మైదానంలోనే కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. రొనాల్డో రెండు గోల్స్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో పోర్చుగల్ జట్టు వన్-సైడ్‌గా 5–0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ అద్భుత విజయంతో టోర్నమెంట్‌లో పోర్చుగల్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఎన్ని ఏళ్లు గడిచినా, వయసు పెరిగినా రొనాల్డో క్లాస్ అస్సలు తగ్గలేదంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
‘Ganpati Bappa Blessed Cristiano Ronaldo!’: Fan Carries Lord Ganesha Idol Inside Stadium As Portugal Secures 5-0 Win Over Uzbekistan At FIFA World Cup 2026 | Video#Sports #FIFAWorldCup #CristianoRonaldo #LionelMessi #Ganpati https://t.co/HQoyveBtna
— Free Press Journal (@fpjindia) June 25, 2026
𝐂𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧𝐨 𝐑𝐨𝐧𝐚𝐥𝐝𝐨 at his best. 🇵🇹 pic.twitter.com/C9AFikoNW1
— World Cup Xtra (@WorldCupXtraa) June 23, 2026