
ముంబయి: మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ తన నివాసంలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని డిండోరి నియోజవర్గం నుంచి ఎన్‌సిపి తరఫున నరహరి ఎంఎల్‌ఎగా గెలిచారు. బిజెపికి ఎన్‌సిపి మద్దతు ఇవ్వడంతో నరహరికి ఆహార ఔషదాల నియంత్రణ మంత్రిత్వ శాఖ కేటాయించారు. నాసిక్ జిల్లాలో నరహరికి గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలల వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయను మంత్రి వర్గం నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
సర్కార్ నామా సౌజన్యంతో