Reading Time: < 1 minute

అమరావతి: ఏజెన్సీలో భారీ డ్రోన్ కుప్ప కూలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం బోయితల్లి గ్రామ శివారులో జరిగింది. రెడ్ వింగ్ సంస్థ ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బొయితిలి గ్రామ శివారులో డ్రోన్ దారి తప్పి చెట్లలో పడిపోయింది. రెడ్ వింగ్ సంస్థ ఉద్యోగులు అక్కడికి చేరుకొని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ మినీ హెలికాప్టర్ లాగా కనిపించడంతో పలు గ్రామ ప్రజలు డ్రోన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు.