Reading Time: < 1 minute
Prabhas Vs Mahesh Babu Is Varanasi Following The Kalki Bounty Hunter Formula

Kalki-Varanasi: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పేలా వస్తున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా, ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లోని హీరోల పాత్రలకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి’లో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో కనిపించారు. మోడ్రన్ టెక్నాలజీ మరియు పురాణాలను మేళవించి చూపించిన ఈ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

అయితే, ఇప్పుడు వారణాసి సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్ర కూడా బౌంటీ హంటర్ తరహాలోనే ఉంటుందని, గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పాత్రకు త్రేతాయుగంలోని శ్రీరాముడి పాత్రకు లింక్ ఉంటుందని అంటున్నారు. కల్కిలో ప్రభాస్ భైరవ పాత్ర, ద్వాపర యుగంలోని కర్ణుడి పాత్రకు లింక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రభాస్-మహేష్‌ ఒకే తరహా పాత్రలు పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాల కథా నేపథ్యం మాత్రం వేరే అయినప్పటికీ.. ఇద్దరు హీరోలు మాత్రం బౌంటీ హంటర్లే.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే.. వారి మూలాలు పురాణ పురుషులతో ముడిపడి ఉండటం విశేషం. అయితే, వారణాసిలో మహేష్ బాబు బౌంటీ హంటర్ అనే వార్తల్లో ఎంత వరకు నిజముందనేది ఇప్పుడే ఓ అంచనాకు రాలేము. అన్నట్టు.. వారణాసిలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మేకింగ్‌కు థియేటర్లో రాముడి ఎపిసోడ్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Also Read: Megastar: రామ్ చరణ్‌ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!