Reading Time: < 1 minute

గురువారం పెరిగిన గోల్డ్.. శ్రీరామ నవమి ముందు బ్రేక్ తీసుకున్న వెండి

Caption of Image.

అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా అస్సలు కనిపించటం లేదు. దీంతో నిన్నటి వరకూ శాంతి చర్చలపై ఆశలతో గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీని తిరిగి స్టార్ట్ చేసినప్పటికీ.. గురువారం మళ్లీ చతికిలపడ్డాయి. దీంతో బంగారం రేటు స్వల్పంగా పెరగగా.. మరోపక్క వెండి మాత్రం చలనం లేకుండా ముందుకెళుతోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతంలో తాజా రేట్లను ముందుగా పరిశీలించాలి.

మార్చి 26న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగింది. మార్చి 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.22 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 689గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 465గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : వీవర్ చేతికి సెంట్రమ్ ఫైనాన్స్.. 75 శాతం వాటా కొనుగోలు

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 26, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 60వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.260 వద్ద ఉంది.  

©️ VIL Media Pvt Ltd.