Reading Time: < 1 minute

సర్పంచ్ అవమానించారంటూ ఆలయ పురోహితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఏనుగల్ గ్రామంలో ఏళ్ల నాటి రామనవమి కల్యాణ వేదిక మార్పుపై ఆలయ పురోహితుడితోపాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామనవమి కల్యాణ వేదిక మార్పు విషయంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో సర్పంచ్ తనను వమానించారంటూ ఆలయ పురోహితుడు వెంకన్నచార్యులు పురుగుల మందు తాగిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పురోహితుడు వెంకన్న చార్యులు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పురోహితుడి వైద్య ఖర్చులు సర్పంచే భరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.