
కాంగ్రెస్ నాయకురాల సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెను వెంటనే స్థానిక సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్సలకు చేర్పించారు. సోనియా గాంధీ ఆరోగ్యంనిలకడగా ఉంది. పూర్తిగా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తమ ప్రకటనలో తెలిపారు. కడుపులో , మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్ సంబంధిత సమస్యలను గుర్తించారు. వీటిపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని అజయ్ స్వరూప్ వివరించారు. అంతకు ముందు పార్టీ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వివరించారు. వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, పరిస్థితి విషమంగా లేదని తెలిపారు.