
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేసిన బిజెపి.. మూడో జాబితాలో కీలక నియోజకవర్గాల నుంచి మరో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆర్.జి. కార్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్‌కు బిజెపి టికెట్ ఇచ్చింది. బిజెపి, ఆమెను పానిహటి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది.
తన కుమార్తెకు న్యాయం కోసం, పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు రత్న దేబ్‌నాథ్ గతంలో చెప్పారు.