
న్యూఢిల్లీ: మధ్య ప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న పరిస్థితులపై ఇరువురు నేతలూ చర్చించారు. ప్రపంచ నౌకాయానానికి కీలకమైన హార్మూ జ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడంపై చర్చించినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలో ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ సంభాషణ జరపడం ఇది రెండోసా రి. అయితే ఈ సంభాషణను ట్ర ంప్ ప్రారంభించినట్లు సమాచారం. ఇరాన్ హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా ఇచ్చిన గడువును
ఐదు రోజులు పొడిగించిన ఒకరోజు తర్వాత ఈ చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్‌లో సంభాషించినట్లు ప్రధా ని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై ఉపయోగకరమైన చర్చలు సాగాయన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గిం చి, శాంతి పునరుద్ధరించేందుకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం, అందరికీ అందుబాటు లో ఉండటం యావత్ ప్రపంచానికి అ త్యవసరమని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం కోసం కొనసాగుతున్న ప్రయత్నాలకు భారత్ సహకారం ఉంటుందని తెలిపారు.