
భవన నిర్మాణ నిబంధనల్లో
సవరణలు జీఓ 95 ద్వారా
కొత్త మార్గనిర్దేశక సూత్రాలు
టిడిఆర్‌ల ద్వారా అదనపు
అంతస్థులు హైరైజ్డ్
భవనాల్లో టిడిఆర్‌లు
తప్పనిసరి సెట్ బ్యాక్‌లలో
వెసులుబాటు
మన తెలంగాణ/సిటీబ్యూరో: భవన నిర్మాణదారు ల (బిల్డర్లు)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిం ది. ఇక ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టిడిఆర్)లతో సెట్‌బ్యాక్‌ల్లో మార్పులు లేకుండానే అదనపు అంతస్థుల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగాన్ని మరింత పురోగతి వైపు నడిపించేందుకు, హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు టిడిఆర్‌ల వినియోగంపై ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ భవన ని ర్మాణ నిబంధనలు 2012, జీఓ నెం. 168’కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాల న, పట్టణాభివృద్ధి (ఎంఏ, యుడి) విభాగం తాజా గా జీవో నెం. 95ను విడుదల చేసింది. తాజా మా ర్పులతో హై-రైజ్డ్ భవనాల నిర్మాణాలకు అదనంగా మరో అంతస్థు కలిసిరానున్నది. అనుమతి పొంది న భవన నిర్మాణపు సెట్ బ్యాక్‌లతోనే మరో అదనపు అంతస్థును నిర్మించుకునే సౌలభ్యాన్ని ప్రభు త్వం కల్పించింది. ముఖ్యంగా టీడీఆర్ వినియో గం, అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్‌ల సడలింపులపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
వెసులుబాటు..
జీఓ 95 ద్వారా వెలువరించిన తాజా మార్గనిర్దేశకాల ప్రకారం, టిడిఆర్‌తో నిర్మించిన హైరైజ్‌డు భ వనాల్లో చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ గదులు, వాటర్ ట్యాంకులకు మినహాయింపునిచ్చింది. పారిశ్రామిక ప్రాం తాల్లోని భవనాలు, వాస్తుకోసం భవనాల్లో వాటర్ ట్యాంక్‌లను కూడా పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం వెసులబాటు కల్పించింది. దీంతో భవనం ఎత్తు పెరిగినా, అనుమతుల ప్రక్రియలో బిల్డర్లకు సెట్‌బ్యాక్‌లను వదలడంతో కొంత మినహాయింపు లభించనుంది. 2000 చ.మీ.లకు పైగా ఉన్న ప్లాట్లకు 40 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ టిడిఆర్‌ల ద్వారా 3 అదనపు అంతస్థులకు అనుమతి లభిస్తుంది. ఇదే విస్తీర్ణంలోని ప్లాట్‌లో రోడ్డు వెడల్పు 60 అడుగులుగా ఉంటే టిడిఆర్ ద్వారా 4 అంతస్థులు, 80 అడుగులు రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్థులను అనుమతించడం జరుగుతుంది. కానీ, ఫైర్, ఏయిర్‌పోర్టు ఎన్‌ఓసిలతో పాటు ఇతర నియమాలను పాటించాలని సూచించింది. హైరైజ్డ్ కానీ భవన నిర్మాణాలు టిడిఆర్‌ను వినియోగించిన సందర్భంలో కనీస సెట్‌బ్యాక్‌లను పాటించాలని స్పష్టంచేసింది.టిడిఆర్‌ను వినియోగించి నిర్మించే హైరైజ్‌డు భవనాలకు సెట్‌బ్యాక్‌ల విషయంలో వెసులుబాటు కల్పించింది. రోడ్డు విస్తరణలో భూమిని కోల్పోయిన ప్రాంతంలో కనీసంగా సెట్ బ్యాక్‌లను పాటించాలని స్పష్టం చేసింది.
టిడిఆర్ తప్పనిసరి..
750 చ.మీ.ల నుండి 2000 చ.మీ.లలో నిర్మించే భవనాలు 18 మీ.ల నుండి 21 మీ.ల ఎత్తులో నిర్మించే భవనాలు టిడిఆర్‌ను వినియోగించడం తప్పనిసరి చేసింది. వీటిలో పార్కింగ్‌తో పాటు ఇతర నియమాలను కూడా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక వేళ మాస్టర్‌ప్లాన్ రోడ్‌ను తొలగించినా, రోడ్‌ను తగ్గించినా, సవరించినా.. భవన నిర్మాణ దరఖాస్తుదారులు డెవలప్‌మెంట్ చార్జీలను చెల్లించడంగానీ, ఈ చార్జీలకు సరిపోవు టిడిఆర్‌లను సమర్పించే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. 10 అంతస్థుల నుండి 20 అంతస్థుల భవన నిర్మాణాలలో 10వ అంతస్థు తర్వాత బిల్టప్ ఏరియాలో 3శాతం బిల్టప్ ఏరియాను టిడిఆర్‌ల ద్వారా నిర్మాణం చేయాలని షరతును విధించింది. హైరైజ్డ్ భవనాల కేటగిరీలోని 20 అంతస్థులకు పైబడి నిర్మిస్తున్న భవనాలలో 5 శాతం బిల్టప్ ఏరియా టిడిఆర్ వినియోగంతో చేపట్టాలని నిర్దేశించింది. ఈతరహా హైరైజ్డ్ భవన నిర్మాణాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు 50% టిడిఆర్‌ను జతపరచాలి. మిగతా 50% టిడిఆర్ ఈ భవనపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకునే సమయంలో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.