
నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానంతో ఫార్యక్టరీకి అవసరమయిన విద్యుత్ స్వయంగా తయారు చేసుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు ఫ్యాక్టరీ ఆవరణలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి ఫ్యాక్టరీకి అవసరమయిన నీటిని సైతం అక్కడే రీసైక్లింగ్ ద్వారా స్టోర్ చేసి వినియోగించనున్నారు.