Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ పార్టీకి అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశాడు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ నుంచి డ్రగ్స్ కొన్నాడు. రోహిత్‌కు ఇప్పటివరకు అభిషేక్ 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 

మొయినాబాద్ లోని మాజీ ఎంఎల్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్  దాడి చేసి ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో వారిపై కాల్పులు జరిగాయి. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్‌లు ఉన్నట్లు వెల్లడించారు.