Reading Time: 2 minutes
Ipl 2026 Riyan Parag Strong Warning To Vaibhav Suryavanshi Ahead Of Season

IPL 2026: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. దీనికోసం అన్ని జట్లు వారి కొత్త సహచరులతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. కొత్త ఏడాది.. కొత్త సీజన్.. కొత్త అంచనాలు. ప్రతిసారి సీజన్ మొదలు కాకముందు నుంచే ఎన్నో ఎక్స్పెటేషన్స్. ఇందులో ఈసారి అందరి దృష్టి 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై ఉందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్, భారీ సిక్సర్లు కొట్టడంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.

Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..

2025 ఐపీఎల్ సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్ల భారీ మొత్తంతో వైభవ్‌ ను కొనుగోలు చేయడం అప్పుడు సంచలనం సృష్టించింది. అయితే మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు సాధించి, 36 సగటుతో 206.56 స్ట్రైక్ రేట్‌తో అబ్బురపరిచాడు. జట్టులో సంజు శాంసన్ గాయపడితే అతడికి బదులుగా జట్టులోకి వచ్చిన వైభవ్.. ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ పై తన రెండో మ్యాచ్‌ లోనే ఏకంగా 35 బంతుల్లో శతకం బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా, అలాగే అత్యంత వేగంగా శతకం సాధించిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Kunika Sadanand Marriage: 62 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అంటున్న సీనియర్‌ నటి..

ఇక అది అంత గతం. ఈ ఏడాదిలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో కూడా వైభవ్ రెచ్చిపోయాడు. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌ పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో ఇప్పుడు ఐపీఎల్ 2026లో వైభవ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందిస్తూ.. వైభవ్‌ పై ఒత్తిడి పడకుండా చూడాలని తాను ప్రయత్నిస్తున్నట్లు అన్నారు. ఈసారి హైప్, ప్రెషర్ సహజమే.. కానీ ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్ తీసుకుంటాడు. వైభవ్ కేవలం స్వేచ్ఛగా ఆడితే చాలు అని పేర్కొన్నారు. అంతేకాదు మీడియా దృష్టి నుంచి దూరంగా ఉంచి, అతడు సహజంగా ఆటను ఆస్వాదించేలా చేస్తానని కెప్టెన్ తెలిపారు. దీనితో సీజన్ మొదలు కాకముందే వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ నుండి ఓ వార్నింగ్ అందుకున్నట్లు అయ్యింది.