Reading Time: 2 minutes
Mumbai Man Charges Money To Listen To Peoples Problems Viral Video Sparks Debate

Viral Video: మనసు ఉండాలే కానీ.. డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు. ప్రస్తుతం సమాజం ఉన్న కొత్తకొత్త పోకడలతో సమాజంలో కొందరు కొత్తకొత్త ఆలోచనలతో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ముంబైలో ఓ యువకుడు చేపట్టిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల వ్యక్తిగత సమస్యలు, బాధలు వినేందుకు డబ్బులు తీసుకుంటున్న ఈ యువకుడి వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దామా..

IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!

వైరల్ వీడియోలో ఓ వ్యతి తన చేతిలో “ఎవరైనా తమ బాధ చెప్పుకోవాలనుకుంటే నేను వినగలను” అనే సందేశంతో హిందీలో రాసిన ఓ బోర్డును పట్టుకుని కనిపించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండోయ్.. అతను అందిస్తున్న ఈ సేవకు ప్రత్యేక రేట్లు కూడా నిర్ణయించాడు. ఇందులో భాగంగా చిన్న సమస్యలు వినేందుకు రూ.250, తీవ్రమైన సమస్యలకు రూ.500, కలిసి కూర్చొని ఏడవాలనుకుంటే రూ.1000 వసూలు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ సేవలను అందిస్తున్న వ్యక్తి పేరు ప్రిథ్విరాజ్ బొహ్ర. అతను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌ లలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు.

ఇక ఈ విషయాన్నీ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అటుగా వెళ్తున్న సమయంలో అతని వెంటపడింది. అంతే అతను ఈ విషయాన్నీ ప్రపంచానికి చెప్పాడు. ఇక ఆ వీడియోలో “నిజంగా ప్రజలు వస్తారా?” అని అడిగగా.. “అవును, కొందరు వచ్చి తమ బాధలు పంచుకుంటారు” అని చెప్పడం మనం వీడియోలో చూడవచ్చు. కొందరు నా వద్దకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటారని, దానికి అనుగుణంగా తాను కూడా పరిశరాలను అందిస్తానని చెప్పడం కొసమెరుపు. ఈ ఘటనతో ప్రజల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది.

LPG Tankers Cross Strait of Hormuz: గుడ్‌న్యూస్.. హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం..!

అయితే ఈ విషయంపై నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ “ఇది గొప్ప ఆలోచన” అంటుంటే, మరికొందరు “బాధలు వినేందుకు కూడా డబ్బులు తీసుకోవడం సరైనదేనా?” అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు జోవియల్ గా స్పందిస్తూ “ఇదే పని మేము ఫ్రీగా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చేస్తుంటాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది ఒక బిజినెస్ మోడల్‌గా మారిపోవడం, నగరాల్లో ఒంటరితనం ఎంత పెరిగిందో చూపిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.