Reading Time: < 1 minute
Kunika Sadanand Opens Up On Love Life 62 Year Old Actress Ready To Marry Again

Kunika Sadanand Marriage: సీనియర్ నటి కునికా సదానంద్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. 62 ఏళ్ల వయసులో కూడా తాను ప్రేమకు, పెళ్లికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. వినోద రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కునికా, ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు. ఇప్పటివరకు తాను ఆరు సంబంధాలలో ఉన్నానని వెల్లడించారు. అందులో రెండు వివాహాలు, రెండు సహజీవనాలు, ఇంకా రెండు స్వల్పకాలిక సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!

సమాజంలో ఇలాంటి స్వేచ్ఛ ఎక్కువగా పురుషులకు మాత్రమే ఉంటుందని, కానీ మహిళలకు కూడా అదే హక్కు ఉందని కునికా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కూడా తాను ప్రేమ కోసం సిద్ధంగా ఉన్నానని, అయితే ఈసారి స్థిరమైన, నిబద్ధత ఉన్న సంబంధం కావాలని చెప్పారు. ఒకప్పుడు ప్రముఖ గాయకుడు కుమార్ సానుతో కునికా సదానంద్‌కు ప్రేమ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో కొన్ని సంవత్సరాలు సహజీవనం కూడా చేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఆ సంబంధం చివరకు నిలవలేదని తెలిపారు. వివాహ జీవితంలో కూడా కునికాకు రెండు సార్లు అనుభవం ఉంది. కానీ ఆ సంబంధాలు సఫలం కాలేదు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని ఒంటరిగా పెంచడానికి తాను ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పారు. ఇప్పటికీ జీవితంలో ఒక మంచి భాగస్వామి దొరికితే, మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కునికా స్పష్టం చేశారు. ఈ వయసులో కూడా తన భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం చాలా మందిని ఆకట్టుకుంటోంది.