Reading Time: < 1 minute
Adilabad Road Accident Travels Bus Collides With Lorry 15 Injured On Nh 44

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. MDK ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓవర్‌టేక్ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముఖ్యంగా క్యాబిన్ భాగం పూర్తిగా దెబ్బతింది.

WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్‌ లేకుండా సీక్రెట్‌ మెసేజ్‌లు..!

ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఓవర్‌టేకింగ్ కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..