Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2026–/2027 వార్షిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొత్తగా 9 పథకాలను ప్రకటించింది. వీటిలో &

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం:

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం-పేద, మధ్యతరగతి, ధని క అనే తేడా లేకుండా జూన్ 2, 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ అందించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.4,000 కోట్ల కేటాయించింది.

చేయూత పథకం: చే యూత పథకం కింద అ ర్హులైన లబ్ధిదారులకు 2 లక్షల కొత్త పెన్షన్లు మం జూరు చేయనున్నట్టు పే ర్కొంది. ఈ పథకానికి రూ.14,861 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: ఎంపిక చేసిన ప్ర భుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయనుంది. ప్రతి పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సుమారు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్ల కేటాయించింది.

విద్యార్థులకు అల్పాహారం: 2026-27 విద్యా సంవత్సరంనుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే కొత్త పథకం అమలు చేయనుంది. అలాగే వారంలో మూ డు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందించనుంది. ఈ పథకానికి రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనుంది. ఈ పథకానికి రూ.100 కోట్ల కేటాయించింది.

క్యాష్‌లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్: ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారిత కుటుం బ సభ్యులకు క్యాష్‌లెస్ ఆరోగ్య రక్షణ పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా సుమారు 23.51 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు చేయనున్నది.

ఉద్యోగుల ప్రమాద బీమా: దేశంలో తొలిసారిగా ఉద్యోగుల కోసం సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టింది.

ఈ పథకం కింద:

* ప్రమాద మరణం సంభవిస్తే రూ.1.2 కోట్ల పరిహారం

* 60 ఏళ్ల వయస్సు వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్

* విమాన ప్రమాద మరణానికి అదనంగా రూ.2 కోట్ల కవరేజీ

ఈ పథకం ద్వారా 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

ఆరోగ్య, బీమా పథకాల కోసం కలిపి రూ.1,056 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

8. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్: యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నది.

ఈ పథకం కింద:

* నైపుణ్య శిక్షణ

* భాషా శిక్షణ

* వీసా మార్గదర్శకం

* ప్రయాణ సాయం, రక్షణ,హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పథకానికి రూ.1,056 కోట్ల కేటాయించింది.

9. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్‌షిప్: ఏటీసీలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనున్నారు.ఈ పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది.