Reading Time: < 1 minute

జగిత్యాలలో అమానవీయ ఘటన: వృద్ధుడికి వైద్యం చేయించలేక శ్మశానంలో వదిలేసిన కుటుంబ సభ్యులు

Caption of Image.

మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతుంది. కాసుల కక్కుర్తిలో పడి బంధాలు, అప్యాయత, అనురాగాలను కూడా మర్చిపోతున్నారు. నవమాసాలు మోసి, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వృద్ధ్యాప్యంలో అనాథలుగా వదిలేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి అమానవీయ ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 

జగిత్యాల టౌన్‎లోని‎ గాంధీనగర్‎కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్‎ను స్థానికంగా ఉండే శ్మశాన వాటికలో వదిలివెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వృద్ధుడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అందిస్తున్నారు. 

కొంతకాలంగా రెండు కిడ్నిలు చెడిపొయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు శ్రీధర్. దీంతో వైద్యం చేయించడం ఇష్టం లేక కుటుంబ సభ్యులే స్మశానంలో వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

©️ VIL Media Pvt Ltd.