July 11, 2026

కస్టమర్ లా వచ్చి.. షాపింగ్ మాల్స్ లో ఉంగరాలు మాయం చేస్తున్న కేటుగాడు

కస్టమర్ లా వచ్చి.. షాపింగ్ మాల్స్ లో ఉంగరాలు  మాయం చేస్తున్న కేటుగాడు
Reading Time: < 1 minute

కస్టమర్ లా వచ్చి.. షాపింగ్ మాల్స్ లో ఉంగరాలు మాయం చేస్తున్న కేటుగాడు

Caption of Image.

హైదరాబాద్ షాపింగ్స్ మాల్స్ లో ఉంగరాలు కొట్టేస్తున్న కేటుగాడిని కూకట్ పల్లి  పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఉంగరాలు పెట్టి బంగారు ఉంగారాలను కొట్టేసిన అతడి నుంచి మూడు తులాలకు పైగా ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.

బీరంగూడకు చెందిన సాగర్ (30) అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని  సీఎంఆర్, మలబార్ గోల్డ్, పంజాగుట్టలోని  సీఎంఆర్ మాల్స్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. షాపింగ్ మాళ్లలో సిబ్బంది దృష్టి మళ్లించి బంగారు ఉంగరాలను దొంగిలిస్తున్నాడు.  కస్టమర్‌లా వెళ్లి  సేల్స్ ప్రతినిధులు ఉంగరాలు చూపిస్తున్న సమయంలో తన దగ్గర  ఉన్న నకిలీ ఉంగరాలను ట్రేలో పెట్టి అసలు బంగారు ఉంగరాలను  దొంగిలిస్తున్నాడు.  వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన కూకట్‌పల్లి క్రైమ్ టీమ్, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుంచి సుమారు 32 గ్రాముల బరువున్న మూడు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

►ALSO READ | హైదరాబాద్‎లో అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు

©️ VIL Media Pvt Ltd.