July 11, 2026

Gautam Gambhir: టెస్టుల్లో భారత జట్టు వైఫల్యాలు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam Gambhir: టెస్టుల్లో భారత జట్టు వైఫల్యాలు..  గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Reading Time: < 1 minute

Gautam Gambhir: టెస్టుల్లో భారత జట్టు వైఫల్యాలు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Caption of Image.

Gautam Gambhir: భారత జాతీయ క్రికెట్ జట్టుకు వైట్‌బాల్ క్రికెట్‌లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2025, 2026లలో వరుసగా టీ20 వరల్డ్ కప్ ని కైవసం చేసుకుంది. కానీ టెస్ట్ క్రికెట్‌లో మాత్రం భారత జట్టు ఆశించిన మేర స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు.  బంగ్లాదేశ్, వెస్టిండీస్‌పై మాత్రమే సిరీస్‌లు గెలిచిన భారత్, స్వదేశంలో  న్యూజిలాండ్ చేతిలో 3-–0తో వైట్‌వాష్‌కు గురి కావడం, 2024- 25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీను కోల్పోయింది.. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2- 2తో డ్రా చేసుకున్నప్పటికీ.. దక్షిణాఫ్రికాతో 2- 0 తేడాతో పరాజయం పాలైంది.

టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. జట్టు ప్రస్తుతం ట్రాన్సిషన్ దశలో ఉందని పేర్కొన్నారు. న్యూజిలాండ్ సిరీస్ ఆడిన జట్టు, దక్షిణాఫ్రికా సిరీస్ ఆడిన టీమ్ పూర్తిగా భిన్నం.. ఈ రెండు సిరీస్‌లను ఒకేలా చూడటం సరికాదు.. జట్టు ఫలితాల బాధ్యత నాదే.. విమర్శలు స్వాగతిస్తాను.. కానీ జట్టు మార్పు దశలో ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన తెలిపారు. అలాగే ఇంగ్లాండ్‌లో భారత్ సాధించిన విజయాలను కూడా గుర్తు చేశారు. కాబట్టి ఒక్క సిరీస్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తగదని గంభీర్ సూచించారు.  

న్యూజిలాండ్ సిరీస్ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉన్నారు.. వీరిద్దరూ 2025 మేలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ ఫామ్‌లో లేకపోవడంతో చివరి టెస్ట్‌కు తానే తప్పుకున్నాడు.. అనంతరం టెస్ట్ జట్టుకు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ, శుభ్‌మన్ గిల్ ని కెప్టెన్‌గా, రిషభ్ పంత్ ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ, స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఘరంగా ఓడిపోయింది.  

 

©️ VIL Media Pvt Ltd.