Reading Time: 2 minutes

Nora Fatehi : నన్ను అడగకుండానే అలా ఎలా చేస్తారు? ‘KD’ మూవీ సాంగ్ పై నోరా ఫైర్!

Caption of Image.

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫలేహి వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ చిత్రం’KD: ది డెవిల్’ (KD: The Devil) లోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ (Sarke Chunar Teri Sarke) పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ నటి స్పందించారు. ఈ వివాదంపై ఒక సుదీర్ఘ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ఆ పాట హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని నోరా కుండబద్దలు కొట్టారు.

నాకు తెలియకుండానే మార్పులు!

ఈ వివాదం అసలు రంగు బయటపెడుతూ నోరా సంచలన విషయాలు వెల్లడించారు. నేను ఈ పాటను మూడేళ్ల క్రితం కన్నడలో షూట్ చేశాను. సంజయ్ దత్ లాంటి దిగ్గజ నటుడు ఉన్న పెద్ద సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? అందుకే అప్పుడు ఒప్పుకున్నాను. అప్పట్లో అది ‘నాయక్ నహి ఖల్ నాయక్ హూ మై’ చిత్రానికి రీమేక్ అని నాకు చెప్పారు అని నోరా వివరించారు.

కానీ, ఇప్పుడు ఆ పాటను హిందీలోకి డబ్బింగ్ చేసే సమయంలో తన అనుమతి తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కన్నడ భాష నాకు రాదు, కాబట్టి మేకర్స్ ఏం చెబితే అదే నమ్మాను. కానీ హిందీ డబ్బింగ్, ఆ లిరిక్స్ విషయంలో నా నుంచి ఎలాంటి అప్రూవల్ తీసుకోలేదు. అసలు హిందీలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈవెంట్‌లోనే అసహనం.. 

ఈ పాట లాంచ్ ఈవెంట్‌లో తాను చాలా ఇబ్బంది పడ్డానని నోరా పేర్కొన్నారు. లిరికల్ వీడియోలో తన అసభ్యకరమైన ఫోటోలను ఉపయోగించారని, అలాగే తనకి, సంజయ్ దత్‌కు సంబంధించిన AI ఫోటోలను కూడా వాడారని ఆమె మండిపడ్డారు. ఆ సమయంలో తనకు తీవ్ర కోపం వచ్చినప్పటికీ, ఈవెంట్ గౌరవం కోసం నిగ్రహించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం నోరా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

►ALSO READ | Kangana Ranaut: సారా కూడా సనాతనే.. నిజం చెప్పడానికి భయమెందుకు? – కంగనా సంచలన కామెంట్స్!

చిత్ర యూనిట్‌తో విభేదాలు..

హిందీ పాటను చూసినప్పుడే ఇది వివాదాస్పదమవుతుందని తనకు తెలుసని, వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి తన అభ్యంతరం వ్యక్తం చేశానని నోరా తెలిపారు. నా ఇమేజ్ ను దెబ్బతీసేలాఉన్నాయని చెప్పాను. అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి నేను వైదొలిగాను. అందుకే ఎక్కడా ఆ పాటను ప్రమోట్ చేయలేదు అని స్పష్టం చేశారు. ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో సరైన గౌరవం, అధికారం ఉండదని నోరా తన ఆవేదనను పంచుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

 

బాలీవుడ్‌లో నా పనిని చాలామంది గౌరవిస్తారు. కానీ కొన్ని ఇతర చిత్ర పరిశ్రమలు మా అభిప్రాయాలను అస్సలు పట్టించుకోరని నోరా చెప్పుకొచ్చారు. ఏదేమైనా, ప్రేక్షకుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత వల్ల ఆ పాటను తొలగించడం సంతోషకరం అని ఆమె ముగించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నోరా ఫతేహీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సృజనాత్మకత పేరుతో నటీనటుల అనుమతి లేకుండా AI ఫోటోలను, డబ్బింగ్ వెర్షన్లను వాడటం ఎంతవరకు సమంజసమనే  చర్చ నెట్టింట మొదలైంది.

 

©️ VIL Media Pvt Ltd.