Reading Time: < 1 minute
Stock Market Gains Surge Positive Signals Investors Recovery Asia Crisis

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాదాపు రెండు వారాల పాటు సంక్షోభం అతలాకుతలం చేసింది. ఈ వారం కూడా అలానే ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. బుధవారం కూడా భారీ లాభాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే ముడి చమురు ధరలు కూడా తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. మొత్తానికి ఏదేమైతే ఇన్వెస్టర్ల పంట పండింది. నష్టాల్లోంచి ఒడ్డున పడ్డారు. ఇక రూపాయి విలువ మరింత పతనమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 92.50 దాటింది. 92.65 దగ్గర రికార్డ్ స్థాయి కనిష్ఠానికి చేరింది.

ఇది కూడా చదవండి: US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం

సెన్సెక్స్ 633 పాయింట్లు లాభపడి 76, 704 దగ్గర ముగియగా.. నిఫ్టీ 196 పాయింట్లు లాభపడి 23, 777 దగ్గర ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాలను మినహాయించి.. రియల్టీ, ఐటీ, ఆటో, మీడియా, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఇన్‌ఫ్రా రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఎం అండ్ ఎం అత్యధికంగా లాభపడగా.. కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, సిప్లా, సన్ ఫార్మా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 2 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.6 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్