డిగ్రీ, బీటెక్ అర్హతతో జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్…జీతం రూ. లక్షా 20 వేలు Caption of Image.
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐఓఎల్) జూనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (జేపీఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ/ బి.టెక్. లేదా బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
పూర్తిచేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి వర్క్ మేనేజర్ (హెచ్ఆర్), ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, ఓఎఫ్ఐఎల్ క్యాంపస్, రాయ్‌పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 04.
సెలెక్షన్ ప్రాసెస్: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ indiaoptel.in ను సందర్శించవచ్చు.