
CSK Roar 2026: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కోసం ఫ్రాంచైజీ ప్రత్యేకంగా “రోర్ ’2026” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ మార్చి 22వ తేదీన ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ఈ ప్రోగ్రాంలో ప్రస్తుత జట్టు సభ్యులతో పాటు సుమారు 20 మంది మాజీ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నప్పటికీ, ఇందులో ఎలాంటి పెద్ద ప్రకటనలు ఉండవని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఇది కేవలం సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే అభిమానులతో ఇంటరాక్షన్ కోసం నిర్వహించే కార్యక్రమమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ చెన్నై ఆటగాళ్లను తీసుకురావడానికి ఫ్రాంచైజీ ఇతర జట్లను కూడా సంప్రదించింది. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు చెందిన కోచింగ్ సిబ్బందిని తాత్కాలికంగా విడుదల చేయాలని కోరింది. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్, మ్యాథ్యూ హేడెన్, డ్వేన్ బ్రావో వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా మురళీధరన్ పాల్గొనడంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఆయన త్వరలో శ్రీలంకకు వెళ్లాల్సి ఉండటంతో, తిరిగి వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమానికి హాజరవుతారో లేదో తెలుస్తుంది.
ఇక ఈ ఈవెంట్‌లో సురేష్ రైనా, మురళీ విజయ్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ వంటి మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం చెన్నైలో లేకపోవడంతో ఈ కార్యక్రమానికి రాలేకపోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుత జట్టులోని సంజూ శాంసన్, శివం దూబే ఇంకా జట్టుతో కలవలేదు. వీరిద్దరూ ఈ కార్యక్రమానికి ముందు జట్టులో చేరే అవకాశం ఉంది. దీంతో మాజీ దిగ్గజాలతో పాటు ప్రస్తుత స్టార్ ఆటగాళ్ల సమ్మేళనంతో “రోర్ ’2026” కార్యక్రమం చెన్నై అభిమానులకు మరపురాని జ్ఞాపకంగా నిలవనుంది.
When the OG lion Badri is there,
you already know where to be on March 22! 💛Superfans, see you at #Roar26 🦁
Get your tickets on the CSK App/ @district_india
Link : https://t.co/89XEDCsTjk #WhistlePodu #Yellove pic.twitter.com/YoReUMUjxP— Chennai Super Kings (@ChennaiIPL) March 17, 2026