Reading Time: 2 minutes

జ్యోతిష్యం : మేషరాశి వారి కోరికలు నెరవేరే సమయం వచ్చేసింది.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి..!

Caption of Image.

మేష‌రాశి

ఆదాయం : 11
వ్యయం : 05
రాజపూజ్యం : 01
అవమానం : 04

ప‌రాభ‌వ‌నామ సంవ‌త్స‌రంలో  మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్దంలో కేతువు, లాభస్థానంలో రాహువు, వ్యయంలో శని అలాగే జూన్ 2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్ధం స్థానంలో ఉంటారు. 

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి.

ఈ రాశి వారికి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని అందుకుంటారు. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని కాలంలో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాల‌ని పండితులు  సూచిస్తున్నారు. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. డ‌బ్బు ఖ‌ర్చు అధికంగా ఉంటుంది. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది. 

అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు.కెరీర్ ప‌రంగా మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం అవ‌కాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి.. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి.

వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు.. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
పెళ్లి  సంబంధాలు చూసే వారికి ఆల‌స్యంగా నిశ్చితార్థం జ‌రుగుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. 

ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతోపాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.
 
ఈ రాశికి చెందిన మ‌హిళ‌ల‌కు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా.. సంతానం మీ మాట వినక పోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది. అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. 

స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్ వేర్ రంగంలోని ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోని వారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ కోసం ప్రయత్నించే వారు.. అతికష్టం మీద ఎంపిక అవుతారు.

ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుంటాయి.విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిదండ్రుల అండ‌దండ‌లు పుష్కలంగా ఉంటాయి

  • ప‌రిహారాలు: ప్రతి శ‌నివారం శ‌ని భ‌గ‌వానుడికి తైలాభిషేకంచేయించండి.
  • శ‌ని త్ర‌యోద‌శి రోజున  నువ్వులు, బెల్లం దానం ఇవ్వాలి.
     
  • అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది. 
  • వివాహాల విష‌యంలో తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవద్దు. 
  • స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం
  • ప్రతి మంగ‌ళ‌వారం, శ‌నివారం ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం,
  •  8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం మంచిది.

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.