
USA vs Iran: 2026 ఫిఫా వరల్డ్ కప్ కి ముందు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద వివాదం నెలకొంది. ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తమ జట్టు మ్యాచ్‌ల వేదికను అమెరికా నుంచి మెక్సికోకు మార్చాలని ఫిఫాను కోరింది. ఇప్పటికే వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన ఇరాన్, గ్రూప్ దశ మ్యాచ్‌లను అమెరికాలో ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై యుద్ధం చేస్తుండటంతోనే ఈ వేదిక మార్చాలని కోరినట్లు తెలుస్తుంది.
ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మెహ్దీ తజ్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మా జట్టు భద్రతపై హామీ ఇవ్వలేమని స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు మేము యూఎస్ఏకు వెళ్లలేము.. అందుకే మా మ్యాచ్‌లను మెక్సికోలో నిర్వహించేందుకు ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో టెహ్రాన్ జట్టు వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి స్వాగతిస్తున్నాం.. కానీ వారి భద్రత దృష్ట్యా అమెరికాకు రావడం సరైనదిగా అనిపించడం లేదన్నారు.
డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల కంటే ముందు ఇరాన్ క్రీడా మంత్రి అహ్మద్ దోన్యామాలి చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదంగా మారాయి. అమెరికా చర్యల కారణంగా తమ జట్టు వరల్డ్ కప్‌లో పాల్గొనకపోవచ్చని ఆయన పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ జట్టు గ్రూప్ –Gలో స్థానం దక్కించుకుంది. షెడ్యూల్ ప్రకారం లాస్ ఏంజెలెస్, సియాటిల్ నగరాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్ జట్లతో ఇరాన్ తలపడనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా, అమెరికా వేదికపై ఇరాన్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది.
►ALSO READ | KKR Captain: రింకు సింగ్కి షాక్.. కేకేఆర్ కెప్టెన్ అతడే..
కాగా ఫిఫా వరల్డ్ కప్ 2026ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు కలిసి నిర్వహించబోతున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో 104 మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 11వ తేదీన మెక్సికో సిటీలో ప్రారంభమయ్యే ఈ టోర్నీ, జూలై 19వ తేదీన న్యూయార్క్-న్యూ జెర్సీ స్టేడియంలో ఫైనల్‌తో ముగియనుంది.
🔹مهدی تاج رئیس فدراسیون فوتبال ایران:
وقتی ترامپ صراحتأ اعلام کرده است که نمیتواند امنیت تیم ملی ایران را تأمین کند، قطعا به آمریکا سفر نمیکنیم/در حال مذاکره با فیفا هستیم تا مسابقات ایران در جام جهانی، در کشور مکزیک برگزار شود— Embajada de Irán en México (@IraninMexico) March 16, 2026