Reading Time: < 1 minute
Mudbidri Inspector Sexual Harassment Allegations

Se*xual Harassment : శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళలనే లైంగికంగా వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. మంగళూరు కమిషనరేట్ పరిధిలోని మూడబిద్రి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సందేష్ పి.జి.పై ఒక మహిళ చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

 KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

వివరాల ప్రకారం.. ఒక కుటుంబ కలహాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఇన్‌స్పెక్టర్ సందేష్ టార్గెట్ చేశాడు. ఆమె భర్తను కేసులో ఇరికించి, అతన్ని విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షల డబ్బు ఇవ్వాలని లేదా తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పోస్టింగ్ కోసం హోం మంత్రికి రూ. 50 లక్షలు ఇచ్చి వచ్చానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన గర్వంగా చెప్పుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు.

ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సదరు మహిళను లైంగికంగా వాడుకోవడమే కాకుండా, ఆమె మైనర్ కుమార్తెపై కూడా ఇన్‌స్పెక్టర్ కన్ను వేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మైనర్ బాలిక చదువుతున్న కాలేజీకి వస్తానని బాధితురాలిని ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్ది నెలలుగా ఈ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా, వారు ఆయనను కాపాడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం వివాదాస్పదం కావడంతో మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఏసీపీ శ్రీకాంత్ ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషనర్ కోరారు. మరోవైపు, బాధితురాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి, హోం మంత్రికి , మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..