Reading Time: < 1 minute

జహీరాబాద్ లో కేటుగాళ్లు..స్కూటీ డిక్కీలో నుంచి..క్షణాల్లోనే రూ.. 8 లక్షలు కొట్టేశారు

Caption of Image.

పట్టపగలే  దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పాడిన కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్ లు, ఇండ్లు చోరీ, ఏటీఎం దొంగతనాలు ఇలా దేనీని వదలట్లేదు.   ఈజీ మనీనే టార్గెట్ గా   స్కూటీ డిక్కీ లోని నుంచి  8 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు . ఈ ఘటన  సంగారెడ్డి  జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరిగింది. 

అసలేం జరిగిందంటే..  బాధితుడు నరసింహారెడ్డి భూమి రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ., 8 లక్షలు డ్రా చేసుకుని స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి తనను ఫాలో అయ్యారు దొంగలు.. నరసింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద స్కూటీని  పెట్టి లోపలికి  వెళ్లాడు. తీరా బయటకు వచ్చే సరికి స్కూటీలోని 8 లక్షలను ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. నగదు చోరీపై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు నరసింహారెడ్డి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

డబ్బుతో బయటకు వెళ్లేటపుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు తీసుకునేటపుడు ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.