Reading Time: < 1 minute

తిరుమల: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టిటిడి స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి టిటిడి కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దు. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టిటిడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.