Reading Time: < 1 minute

జడ్చర్ల:  ఇద్దరు యువకులు ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జడ్చర్లలో ఓ మహిళ తన ఇంటికి వెళ్లటానికి ఆటో కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరు యువకులు అటుగా వెళ్తుండగా లిఫ్ట్ అడిగింది. వాళ్లు ఆమెను బైక్ పై ఎక్కించుకొని జడ్చర్ల శివారులోనికి వెళ్లిన తరువాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. వారి నుంచి ఆమె తప్పించుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా బైక్ ను గుర్తించారు. వారిని అతి త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.