Reading Time: 2 minutes

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమం గా నిర్మించిన 750 ఇళ్ళను కూల్చిన స్ధలంలోనే బుధవారం భూదాన్ నిర్వాసితుతలకు ఇళ్ళ ప ట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈమేరకు ఖ మ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. డి ప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూశా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీ దుగా ఈ పట్టాలను బాధితులకు అందచేస్తారు. గత నెల 24న 750 ఇళ్ళను కూల్చివేసిన విషయం లో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఎక్కడయితే ఇళ్ళను కూ ల్చారో అక్కడే ఇంటి స్ధలాలను పంపిణీ చేయాల ని నిర్ణయించారు. గడిచిన పక్షం రోజుల్లో కూల్చి న ఇళ్ళపై 24మంది రెవెన్యూ అధికారులు ఊరూ ర తిరిగి విచారణచేసి అర్హుల లేక్క తేల్చారు. మొ త్తం 730 ఇళ్ళను కూల్చివేయగా ఆరోజు బా ధితులు ఇచ్చిన వివరాల మేరకు వారి స్వగ్రామాని కి వెళ్ళి విచారణ చేశారు.

ఈవిచారణలో చాలా మంది అనర్హులు ఉన్నట్లుతేల్చారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు,కానిస్టేబుళ్ళు, అంగన్ వాడీ టీచర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 730 కు టుంబాల్లో 412 మంది అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన వారు అనర్హులు(బోగస్ )గా ప్రకటించనున్నారు. అర్హులుగా గుర్తించిన వారిలో సొంత ఇంటి స్ధలం లేని 311 మందికి ఇంటి ప్లాట్ పట్టాతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు (రూ.5లక్షల ఆర్దిక సాయం) ప్రొసిడింగ్ పత్రాలను అందజేయనున్నారు.సొంతంగా ఇంటి స్ధలం ఉన్న మరో 101 కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేస్తారు. మొత్తంగా 412 కుటుంబాలకు శాశ్వత గృహ యోగం కల్పించనున్నారు. కూల్చిన చోటే అర్హులైన పేదలకు ఇంటి స్థలం పట్టాలను అందించేందుకు అఘమేఘాలమీద ఏర్పాట్లు చేస్తున్నారు. భూదాన భూముల్లో ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 311 మందికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లోనే ఇంటి స్థలం పట్టా కాగితాలను ప్రదానం చేయనున్నారు.

తమకు కూల్చిన చోటనే ఇళ్ళ పట్టాలను మంజూరు చేసి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని భూదాన నిర్వాసితులు గత పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా జిల్లా యంత్రాగం రఘునాధపాలెం,ఏదులాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిలో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని భావించారు. కానీ ప్రజల నుంచి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నందున కూల్చిన చోట నీడ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 15లోగా బాధితులందరికీ ఇంటి పట్టాలను పంపిణి చేస్తామని, ఈ పక్రియ ఈనెల 10 కల్లా పూర్తి చేస్తామని ఇటివల ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ్ల సమావేశంలో వెల్లడించిన విధంగానే నాలుగు రోజుల ముందే వెలుగుమట్ల భూనిర్వాసితుల కళ్ళలో అనందం వెలుగులు నింపేలా పట్టాలను పంపిణీ చేయనున్నారు.