
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత పబ్లిసిటీ కోసమే పాట్లు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్లలోనూ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. దీనిని కవిత తన క్రెడిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. గతంలో బీసీ బిల్లు విషయంలోనూ కవిత ఇలాగే పబ్లిసిటీ చేసుకున్నారని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.