Reading Time: < 1 minute

అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 13న కామాఖ్య నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారంగా నిలుస్తున్న అస్సాం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే దూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన తక్కువ ప్రయాణ ఖర్చుతో కూడిన ప్రయాణాన్నిఅందించడానికి దోహదపడుతుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గమధ్యంలో నున్న శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్ , పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణ దిశలలో ఆగుతుంది.